దేశీయ మార్కెట్లోకి రియల్‌మీ, హ్యారీ పోటర్ కాంబోలో సరికొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. దీనికి సంబంధించి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఈరోజు ఒక టీజర్‌ను విడుదల చేసింది. "లెట్ ద మ్యాజిక్ బిగిన్", "కమింగ్ సూన్" అనే క్యాప్షన్లతో ఉన్న ఈ బ్యానర్ చూస్తుంటే ఇది ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే లభించే ఒక లిమిటెడ్ ఎడిషన్ మోడల్ అని అర్థమవుతోంది. ఫోన్ పేరును అధికారికంగా వెల్లడించకపోయినా, ఇది రియల్‌మీ 16 ప్రోకు చెందిన స్పెషల్ హ్యారీ పోటర్ థీమ్ మోడలేనని కథనాలు చెబుతున్నాయి. ఈ కొత్త ఫోన్‌లో హార్డ్‌వేర్ పరంగా పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. ప్రధానంగా డిజైన్, ప్యాకేజింగ్ బాక్స్, థీమ్ ఆధారిత యూజర్ ఇంటర్‌ఫేస్ మాత్రమే మారుతాయని భావిస్తున్నారు. గతంలో వచ్చిన స్పెషల్ ఎడిషన్ల తరహాలోనే రియల్‌మీ 16 ప్రో ఫీచర్లను అలాగే ఉంచుతూ బయటి లుక్, యూఎక్స్‌ను హ్యారీ పోటర్ స్టైల్‌లో రీడిజైన్ చేయనున్నారు.
0 Comments