పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు కొత్త రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
الثلاثاء، 29 سبتمبر 2026
announced the cancellation of existing registration certificates Central Government Bans New Registration of Paraquat Dichloride Herbicide gazette notification issued on September 22 national
రైతులు, గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందు కొత్త రిజిస్ట్రేషన్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ 22న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలిపింది. పారాక్వాట్ కేవలం కలుపు నివారణ మందు కాదని, మానవ ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్ర ముప్పు కలిగిస్తోందని చాలాకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి నిర్దిష్ట విరుగుడు లేకపోవడం, తీవ్ర విషతుల్యత ఉండటం వల్ల ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు, ప్రజా సంఘాలు, రైతులు పలుమార్లు హెచ్చరించారు. నేల, నీరు కలుషితమవుతున్నాయని, భూసారంపై ప్రభావం పడుతోందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఈ అంశం మరింత తీవ్రంగా చర్చనీయాంశమైంది. మార్చి 30న తెలంగాణ శాసనసభ పారాక్వాట్‌పై కేంద్రం సంపూర్ణ నిషేధం విధించాలని కోరుతూ తీర్మానం చేసింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 60 రోజులపాటు విక్రయం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది. వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో ఈ అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జూలై 10న ముసాయిదా ఉత్తర్వు జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. నిపుణుల కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ సిఫార్సులను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంది. కీటకనాశక చట్టం-1968లోని సెక్షన్ 9కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కమిటీ ఆ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకోవాలని, తిరిగి ఇవ్వని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మనుషులు, జంతువులకు ప్రమాదం కలిగించే పరిస్థితి ఉన్నందున తక్షణ చర్య అవసరమని కేంద్రం స్పష్టం చేసింది.
ليست هناك تعليقات:
إرسال تعليق