సాగు నీటి గుంటలో పడి ఇద్దరు బాలికల మృతిదుర్మరణం

Sunday, September 20, 2026

accompanying their father to the fields crime Khasindepet village Mulugu Mandal telangana Two Girls Die After Falling into Irrigation Pit

t f B! P L

తెలంగాణ లోని ములుగు మండలం ఖాసిందేపేట గ్రామంలో సరదాగా తండ్రితో పాటు పొలానికి వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాసిందేపేట గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు మహమ్మద్ అంజద్ పాషా తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేనులో పురుగుల మందు చల్లేందుకు వెళ్లారు. తండ్రితో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు సమ్యాన్ (19), ఆసియా (10) కూడా పొలం వద్దకు వెళ్లారు. తండ్రి పొలంలో పనిచేసుకుంటుండగా, సాయంత్రం నాలుగు గంటల సమయంలో పిల్లలిద్దరూ సరదాగా సమీపంలో పంట సాగు నీటి నిల్వ కోసం తవ్విన గుంట వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత పిల్లలు ఎక్కడా కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పొలం చుట్టుపక్కల వెతికారు. సందేహం వచ్చి నీటిగుంట వద్దకు వెళ్లి పరిశీలించగా, పిల్లలిద్దరూ నీటిలో మునిగిపోయినట్లు గుర్తించారు. వెంటనే వారిని బయటకు తీసి కాపాడుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, లోతు ఎక్కువ కావడంతో అప్పటికే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. కంటిముందే ఇద్దరు ఆడపిల్లలు అనంతలోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ