యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవ్వడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానాన్ని నిలిపివేయకపోతే నిరసనలకు దిగుతామని 'ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ' సహా 'ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్' హెచ్చరించాయి. ఇంధన విక్రయాలపై శాతంతో సంబంధం లేకుండా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ప్రతి యూపీఐ లావాదేవీకి రూ.5 ఫ్లాట్ MDR వర్తిస్తుంది. పెట్రోల్ బంక్ నిర్వాహకులకు లీటరుకు లభించే కమిషన్ రూ.2.40 నుంచి రూ.3.40 మధ్య మాత్రమే ఉంటుంది. ద్విచక్ర వాహనాల కన్నా ఫోర్ వీలర్లు, ట్రక్కుల్లో రూ.3,000 నుంచి రూ.10,000 పైగా ఆన్లైన్ చెల్లింపులు జరుగుతాయి. ప్రతిసారీ రూ.5 కోత పడితే తమ లాభాలు ఆవిరైపోతాయని డీలర్లు ఆందోళన చెందుతున్నారు.సమస్య పరిష్కారం కాకపోతే బంకుల వద్ద "రూ.2,000 కన్నా ఎక్కువ లావాదేవీలకు యూపీఐ తీసుకోబడదు" లేదా "కేవలం నగదు మాత్రమే స్వీకరించబడును" అనే బోర్డులు పెట్టక తప్పదని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం వినియోగదారుల నుంచి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని, కేవలం మర్చంట్లు (వ్యాపారులు) మాత్రమే చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే, వ్యాపారులు ఈ భారాన్ని తట్టుకోలేక నగదు చెల్లింపులను మాత్రమే ప్రోత్సహిస్తే, దేశంలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని సీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది.
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించనున్న కేంద్రం : దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత
Telugu Lo Computer
0
Comments
Post a Comment