శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ ముగిసిన తర్వాత పార్కింగ్ ఏరియాలోకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ పోల్‌ను ఢీకొట్టింది. ఉదయం సుమారు 9:02 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ పూర్తి సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు ధృవీకరించారు. ప్రమాదానికి గురైన ఇండిగో విమానం (ఫ్లైట్ నంబర్: 6E 225, రిజిస్ట్రేషన్ నంబర్: VT-NOG) ముంబై నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ చేరుకుంది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, విమానాన్ని బే/పార్కింగ్ స్లాట్‌లోకి మళ్లిస్తున్న సమయంలో నియంత్రణ తప్పి విజువల్ డాకింగ్ గైడెన్స్ సిస్టమ్ పోల్‌ను ఢీకొట్టింది. ఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది మరియు గ్రౌండ్ స్టాఫ్ అప్రమత్తమయ్యారు. మాన్యువల్ మెట్లు ఉపయోగించి ప్రయాణికులను మరియు విమాన సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సాంకేతిక లోపం లేదా పైలట్ పొరపాటు వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో విమానయాన అధికారులు విచారణ ప్రారంభించారు.

Post a Comment

أحدث أقدم