వన్ ట్యాగ్ పోర్టబిలిటీ విధానాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ - 2026 వేదికగా వన్ ట్యాగ్ అనే పోర్టబిలిటీ విధానాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రారంభించారు. ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకును మార్చుకోవాలనుకుంటే వాహన విండ్ షీల్డ్ పై ఉన్న పాత స్టిక్కర్‌ను పీకేసి, కొత్తది అంటింటాల్సిన అవసరం లేదు. ప్రస్తుత ట్యాగ్ ద్వారానే వేరే బ్యాంకుకు మారవచ్చు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ IHMCL, పేమెంట్స్ నెట్‌వర్క్ ఎన్‌పీసీఐ కలిసి ఉమ్మడిగా ఈ సరికొత్త సర్వీసులను రూపొదించాయి. గతంలో వాహనదారులు ఒక బ్యాంక్ నుంచి మరో బ్యాంకుకు ఫాస్టాగ్ మార్చుకోవాలంటే పాత ఖాతాను క్లోజ్ చేసి పాత స్టిక్కర్ తీసేసి కొత్త బ్యాంకు వద్ద మళ్లీ కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. అయితే ఈ వన్ ట్యాగ్ రాకతో వాహనదారుడి ట్యాగ్ ఐడీ (Tag ID), వాహన రిజిస్ట్రేషన్ నంబర్, విండ్ షీల్డ్ పై ఉండే స్టిక్కర్ యథాతథంగా కొనసాగనున్నాయి. ఈ ఫాస్టాగ్ బ్యాంక్ పోర్టబిలిటీ సేవలను నేషనల్ హైవేస్ అథారిటీకి చెందిన అధికారిక రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ అప్లికేషన్ ద్వారా సులభంగా పొందవచ్చు. యాప్ లో ప్రాథమిక అర్హత చెకింగ్, సురక్షితమైన వెరిఫికేషన్ ప్రక్రియ, వినియోగదారుని అంగీకరం తీసుకున్న తర్వాత నచ్చిన కొత్త బ్యాంకును ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. బ్యాంక్ మార్పు సమయంలో పాత వాలెట్‌లో ఉన్న పెండింగ్ లావాదేవీలు, ఖాతా క్లోజర్, మిగిలి ఉన్న బ్యాలెన్స్‌ను రీఫండ్ చేసే బాధ్యతను మునుపటి బ్యాంకే చూసుకుంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త బ్యాంక్ సదరు ఫాస్టాగ్ సేవలను స్వీకరిస్తుంది. టాల్ ప్లాజాల వద్ద ఎలాంటి అదనపు టెక్నాలజీ మార్పులు లేకుండానే ఈ ట్రాన్సిషన్ వేగంగా జరుగుతుందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎన్‌పీసీఐ తెలిపింది.

Post a Comment

0 Comments