ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికై, ఆ తర్వాత పెద్దల సభలో సామాన్యుల ప్రశ్నలు అడిగి కామన్ మెన్ ఎంపీగా ప్రసంశలు అందుకున్న రాఘవ్ చద్దా ఆ తర్వాత యూటర్న్ తీసుకుని బీజేపీలోకి ఫిరాయించారు. అయినా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఆయనకు ఎన్నికల సంఘం అనూహ్యంగా షాకిచ్చింది.  రాఘవ్ చద్దా పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయనకు ఇక్కడ ఓటు ఉంది. అయితే తాజాగా ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో చద్దా ఓటు గల్లంతైంది. దీంతో పంజాబ్ లో ఓటు లేని కారణంగా ఆయన రాజ్యసభ సభ్యత్వం కోల్పోయే ప్రమాదం ఉందన్న చర్చ మొదలైంది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 3 ప్రకారం రాజ్యసభకు ఎన్నిక కావాలనుకునే వ్యక్తి భారతదేశంలోని ఏదో ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి ఓటరు అయి ఉండాలి, అది పంజాబ్ నుంచే అక్కర్లేదు. అంటే ఆయన మరో చోట నుంచి ఓటరు అయితే సరిపోతుంది. చద్దా 2022 రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో ఓటు నమోదు చేసుకున్నారు. అయితే పంజాబ్ నుండి రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత, ఆయన తన ఓటును పంజాబ్‌కు మార్చుకుని 2024 లోక్‌సభ ఎన్నికలలో ఎస్ఏఎస్ నగర్/మొహాలీలో ఓటు వేశారు. కానీ ఇప్పుడు అక్కడ ఆయన ఓటు లేదు. అయితే ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో ఆయన పేరు లేదు. కానీ తుది జాబితాలో ఉంటే సరిపోతుంది. లేదా పంజాబ్ లో లేకపోయినా వేరే చోట ఉన్నా సరిపోతుంది. అది ఎక్కడో తేలితో ఇబ్బంది లేదు. కానీ ఎక్కడా ఓటు లేకపోతే మాత్రం రాజ్యసభ సభ్యుడిగా అనర్హుడిగా మారే ప్రమాదం ఉంది.

Post a Comment

أحدث أقدم