శంషాబాద్ - బెంగళూరు హైవేపై కంటైనర్ డివైడర్ ను ఢీకొనడంతో, ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొంటూ హోటలోకి దూసుకెళ్లింది. హోటల్లో స్టౌపై మంటలు ఎగిసిపడగా స్థానికులు ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పది మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
0 Comments