అగస్టిన్ లీ బృందంతో రేవంత్ రెడ్డి భేటీ : పెట్టుబడులతోపాటు, రాష్ట్రాభివృద్ధికి ఆర్ధిక సహకారాన్ని కోరిన సీఎం

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సింగపూర్ వాణిజ్య-పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన ఇంధన వాణిజ్య విభాగం శాశ్వత కార్యదర్శి అగస్టిన్ లీ బృందం బుధవారం భేటీ అయింది. మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అంశాలను సింగపూర్ ప్రతినిధులకు సీఎం వివరించారు. హైదరాబాద్‌ను పర్యాటకంగానే కాక నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్న సీఎం ఇప్పటికే హార్వార్డ్, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తమ ఆఫ్ షోర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు, రాష్ట్ర అభివృద్ధికి ఆర్ధికపరమైన సహకారం అందించాలని సీఎం ఆ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. పెట్టుబడులపై సింగపూర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులను ఫ్యూచర్ సిటీలో డిసెంబరులో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సీఎం ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఫ్రాన్సిస్ చోంగ్, కాన్సుల్-జనరల్ విలియం చిక్, ఇతర సింగపూర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments