ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గానుగూడెం గ్రామానికి చెందిన గొనిపాటి శివ (38), సోడదాసి వీరబాబు (35) వినాయక చవితి పూజ కోసం కలువ పూలు సేకరించేందుకు గ్రామ చెరువుకు వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరూ చెరువులోకి దిగగా ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే వారు మృతిచెందినట్లు తెలుస్తోంది.

Post a Comment

أحدث أقدم