తెలంగాణ మాజీ మంత్రి, వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొండా సురేఖ ఈరోజు సోషల్‌ మీడియాలో ఆమె చేసిన పోస్టుగా ఒకటి వైరల్‌ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. "నిరీక్షణ ముగిసింది.. అతిత్వరలో ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తా.. చూస్తూనే ఉండండి.. తెలంగాణ!" అంటూ ఆమె పోస్ట్‌ చేశారన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఉదయం కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె ఎక్స్‌ ఖాతా నుంచి అఫీషియల్‌గా పోస్ట్‌ చేశారు. కాసేపటికే ఆమె పేరిట ఉన్న ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్‌ కనిపించింది. ఇదిలా ఉంటే.. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ తదుపరి అడుగు ఏమిటన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాన్ని అన్ని పార్టీలు గమనిస్తున్నాయి. కొండా సురేఖ కూతురు సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో ముదిరిన పంచాయితీ.. సురేఖను బర్తరఫ్‌ చేసేదాకా వెళ్లింది. మరీముఖ్యంగా మంత్రివర్గం నుంచి ఆమెను తొలగించిన తర్వాత వరంగల్‌ రాజకీయాల్లోనూ చర్చకు దారితీసిన పరిస్థితుల మధ్య ఈ పోస్టు వైరల్‌ అవుతూ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో పెద్ద అప్‌డేట్‌ అంటూ సురేఖ నేరుగా చెప్పకపోయినా.. ఆమె పేరిట వైరల్‌ అయిన ఆ ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో ఆసక్తి మరింత పెరిగింది. 

Post a Comment

أحدث أقدم