ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె జిల్లా కొండామారిపల్లి గ్రామం దేవరెడ్డిగారిపల్లికి చెందిన లేట్ నూలు గంగులప్ప భార్య లక్ష్మీదేవి (83) బైపాస్ రోడ్డులో చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు. దుండగులు ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆమెనగలపై కన్నేసిన నిందితులు ఆగస్టు 26న పథకం ప్రకారం లక్ష్మీదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ములగమూడి చెరువుకు తీసుకెళ్లి పాతిపెట్టారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు శనివారం వడమాలపేట మండలం ములగమూడికి వెళ్లి చెరువులో పాతిపెట్టిన లక్ష్మీదేవి మృతదేహాన్ని వెలికితీయించారు. అనంతరం అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మదనపల్లె బైపాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. లక్ష్మీదేవిని హత్య చేసిన వినోద్, ప్రమీలతో పాటు మరో యువకుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 83 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేయడానికి నిందితులకు మనసెలా వచ్చిందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు.

Post a Comment

أحدث أقدم