హైదరాబాద్‌లో డెవలప్‌మెంట్ సపోర్ట్ కేంద్రాన్ని ప్రారంభించిన 'డోర్‌డాష్' : 500 మంది నిపుణులతో కార్యకలాపాలు : భవిష్యత్ లో 3000 ఉద్యోగాలు
الأربعاء، 30 سبتمبر 2026
'DoorDash' Launches Development Support Center in Hyderabad 000 Jobs Planned for the Future 3 business Operations Begin with 500 Professionals technology telangana
భారత దేశీయ మార్కెట్‌లోకి అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్ దిగ్గజం 'డోర్‌డాష్' అడుగుపెట్టింది. దేశంలోనే తొలి డెవలప్‌మెంట్ సపోర్ట్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభించింది. ఈ నూతన కార్యాలయాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ప్రస్తుతం 500 మంది నిపుణులతో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కేంద్రం రాబోయే కొద్ది సంవత్సరాల్లో ఉద్యోగుల సంఖ్యను 3,000 మార్కుకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గ్లోబల్ సెంటర్ ప్రధానంగా రెండు విభాగాలపై దృష్టి సారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డోర్‌డాష్‌కి ఇది మూడో అతిపెద్ద కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఇంటిగ్రిటీ గ్లోబల్ సర్వీస్ సెంటర్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5.6 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లకు ఈ కేంద్రం ద్వారా సాంకేతిక సేవలు అందనున్నాయి. ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ 'ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న డోర్‌డాష్ సంస్థ వృద్ధికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం నగరానికి దక్కిన గొప్ప గుర్తింపు. ఇది లోకల్ డిజిటల్ కామర్స్, హైపర్‌లోకల్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేస్తుంది. స్విగ్గీ, జొమాటో వంటి భారతీయ యాప్‌లకు స్ఫూర్తినిచ్చిన డోర్‌డాష్ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం ఇక్కడి ఐటీ ప్రతిభకు నిదర్శనం' అని పేర్కొన్నారు.
ليست هناك تعليقات:
إرسال تعليق