కేఫ్-3 తుది నిబంధనలను నోటిఫై చేసిన కేంద్రం

الأربعاء، 30 سبتمبر 2026

automobile Centre Notifies Final CAFE-3 Norms Corporate Average Fuel Economy enhancing fuel efficiency protecting the environment reducing carbon dioxide emissions from cars technology

t f B! P L

కార్ల నుంచి వెలువడే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించి, పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి కార్పొరేట్‌ యావరేజ్‌ ఫ్యూయల్‌ ఎకానమీ (కేఫ్-3) తుది నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. ప్రతి కంపెనీ విక్రయించే మొత్తం వాహనాల సగటు బరువును బట్టి నిర్ణీత ఉద్గార లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు 2027, ఏప్రిల్ నుండి 2032, మార్చి వరకు అమల్లో ఉంటాయి. అయితే, 909 కిలోల కంటే తక్కువ బరువుండే చిన్న కార్లకు ఉద్గారాల్లో ప్రత్యేకంగా 3 గ్రా/కిమీ మినహాయింపు ఇవ్వాలని మారుతీ సుజుకి గట్టిగా కోరింది. దీనివల్ల చిన్న కార్ల విక్రయాల్లో ఆధిపత్యం ఉన్న మారుతికి ప్రయోజనం కలుగుతుందని టాటా మోటార్స్, ఎంజీ వంటి ఈవీ తయారీదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. డ్రైవర్‌ సీటు కాకుండా 8 మంది వరకు సీటింగ్‌ కెపాసిటీ ఉన్న వాహనాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. దేశీయంగా తయారయ్యే వాటితో పాటు, దిగుమతయ్యే వాహనాలూ ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయని కేంద్రం తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించేందుకు ఈవీలకు ప్రభుత్వం 'సూపర్-క్రెడిట్' వెసులుబాటును కల్పించింది. దీని ప్రకారం ఒక ఎలక్ట్రిక్ కార్ విక్రయాన్ని మూడు మామూలు కార్లతో సమానంగా లెక్కించి క్రెడిట్లు ఇస్తారు. దీనివల్ల ఈవీలను ఎక్కువగా అమ్మే కంపెనీలు తమ ఉద్గార లక్ష్యాలను చాలా సులభంగా సాధించగలుగుతాయి. అంతేకాకుండా, ప్రతి ఏడాదీ ఖచ్చితమైన లక్ష్యాలు చేరుకోకపోయినా, నిర్దేశిత ఉద్గార లక్ష్యాల కంటే మెరుగ్గా పనిచేసే కంపెనీలు క్రెడిట్లను సాధించి, వాటిని భవిష్యత్తు సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడంతో పాటు ఇతర కార్ల కంపెనీలకు విక్రయించడానికి లేదా మార్పిడి చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీని కూడా కల్పించారు. సరళంగా చెప్పాలంటే, ఈ కొత్త నిబంధనలు ఆటో కంపెనీలను విద్యుత్, హైబ్రిడ్ వాహనాల తయారీ వైపు వేగంగా అడుగులు వేసేలా ప్రోత్సహిస్తాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ