ఢిల్లీలో మారుతున్న వాతావరణం, తేమతో H1N1 స్వైన్ ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుండటంతో వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన పలువురు వైద్యులు, ఇతరులు H1N1 బారినపడినట్లు సమాచారం. దీంతో ఆసుపత్రులకు ఫ్లూ లక్షణాలతో వస్తున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో చాలామంది వైద్యులను సంప్రదిస్తున్నారు. కాగా, H1N1 సోకితే సాధారణంగా అకస్మాత్తుగా జ్వరం, పొడి దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి, చలి, తీవ్ర అలసట, ఒళ్లు నొప్పులు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ తీవ్రంగా మారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అయితే ప్రతి జ్వరం H1N1 అని భావించాల్సిన అవసరం లేదు. ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతోనూ ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. జ్వరం, దగ్గుతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, తగ్గని అధిక జ్వరం, గందరగోళం, పెదాలు నీలంగా మారడం లేదా లక్షణాలు క్రమంగా తీవ్రం కావడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, మధుమేహం ఉన్నవారు, గుండె లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఢిల్లీలో భారీగా పెరుగుతున్న H1N1 స్వైన్ ఫ్లూ కేసులు
الجمعة، 21 أغسطس 2026
national several doctors and staff members at a government hospital in Delhi have contracted H1N1 Sharp Rise in H1N1 Swine Flu Cases in Delhi
ليست هناك تعليقات:
إرسال تعليق