Ad Code

భారీ హిమపాతంలో చిక్కుకుని పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా దుర్మరణం


నేపాల్‌కు చెందిన ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా అనూహ్య ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు. పీవోకేలో బ్రాడ్‌వీక్‌ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో భారీ హిమపాతంలో చిక్కుకుని మరణించారు. ఈ విషయాన్ని శనివారం ఆయనకు చెందిన అడ్వెంచర్ సంస్థ ఎలైట్‌ ఎక్స్‌పెడ్‌ అధికారికంగా ధృవీకరించింది. ఈ ప్రమాదంలో ఆయనతో వెళ్లిన మరో ఐదుగురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయినట్లు సదరు సంస్థ వెల్లడించింది. ఇంకా ఐదుగురి ఆచూకీ లభించకపోవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2026 జూలై 30 మధ్యాహ్నం సమయంలో నిర్మల్‌ నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ బృందం క్యాంప్‌-2 నుండి క్యాంప్‌-3కి వెళ్తుండగా దాదాపు 7 వేల మీటర్ల ఎత్తులో భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ప్రమాదంలో నిర్మల్‌తో పాటు అమెరికా, ఒమన్, నేపాల్‌కు చెందిన పర్వతారోహకులు, గైడ్‌లు అందరూ మరణించారు. నిర్మల్‌ భౌతికకాయాన్ని ఈరోజువెలికితీశారు.

Post a Comment

0 Comments

Close Menu