తమిళనాడులో అబార్షన్ వ్యతిరేక ర్యాలీ : వివాదాస్పదమైన స్పీకర్ జేసీడీ ప్రభాకర్ హాజరు

الثلاثاء، 11 أغسطس 2026

Anti-abortion rally in Tamil Nadu Controversial appearance by Speaker JCD Prabhakar held in Chennai on August 8 and 9 Organized under the aegis of the Madras-Mylapore Archdiocese

t f B! P L

బార్షన్ వ్యతిరేక ర్యాలీలో తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. స్పీకర్ తీరు మహిళా హక్కులకు వ్యతిరేకమంటూ రాజకీయ ప్రత్యర్థులు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. చెన్నైలో ఆగస్టు 8,9 తేదీల్లో మార్చ్ ఫర్ లైఫ్ పేరిట ఈ ర్యాలీ జరిగింది. మద్రాస్-మైలాపోర్ ఆర్చిడయోసీస్ ఆధ్వర్యంలో స్టెల్లా మేరీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 5 వేల మంది ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. పసి ప్రాణాలను మొగ్గులోనే చిదిమేసే అబార్షన్‌లను సభలో అనేక మంది వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఎమ్‌టీపీ యాక్ట్‌పై కూడా విమర్శలు వచ్చాయి. ఈ సందర్భంగా గర్భధారణతోనే ఓ కొత్త జీవి ప్రాణం పోసుకుంటుందన్న అసెంబ్లీ స్పీకర్ వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. 'గర్భస్థ శిశువుకు కూడా గౌరవం ఉంటుంది. ఈ భావాన్ని వ్యక్తీకరించే వేదికగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పిల్లలు అందరూ దేవుడి దీవెనలే. ఈ దీవెనను వ్యతిరేకించే ఆలోచన ఎవరి మనసుల్లోనూ ఉండకూడదు' అని స్పీకర్ అన్నారు. ఈ కామెంట్స్‌పై రాష్ట్రంలో పలువురు మహిళా హక్కుల కార్యకర్తల విమర్శలు గుప్పించారు. గర్భధారణకు సంబంధించి మహిళల హక్కులకు ప్రాధాన్యమిస్తూ 2021లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అనేక మంది ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్టికల్ 21 ప్రకారం సేఫ్ అబార్షన్ కూడా ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. ఈ ర్యాలీ అసెంబ్లీ స్పీకర్ ఎలా పాల్గొంటారని, స్పీకర్ వాదనతో సీఎం కూడా ఏకీభవిస్తున్నారా? అని షాలిన్ మారియా లారెన్స్ అనే మహిళా హక్కుల కార్యకర్త ప్రశ్నించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ