దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్యను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు కఠిన చర్యలకు ఉపక్రమించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని నిరాకరించేలా ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖలను కోర్టు ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దేశంలో ప్రస్తుతం తిరుగుతున్న వాహనాల్లో మోటారు వాహనాల చట్టం నిబంధనల ఉల్లంఘన విపరీతంగా జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థాయీ సంఘం 2024-25 నివేదిక ప్రకారం, భారతదేశంలోని మొత్తం 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాల్లో ఏకంగా 16.54 కోట్లు (సుమారు 56 శాతం) వాహనాలకు ఎలాంటి ఇన్సూరెన్స్ కవరేజీ లేకపోవడం గమనార్హం. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా ఈ పరిస్థితి అడ్డంకిగా మారుతోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇన్సూరెన్స్ లేని కారణంగా బాధితులు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ముఖ్యంగా మరణం లేదా శాశ్వత అంగవైకల్యం సంభవించిన కేసుల్లో కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతింటున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుప్రీంకోర్టు కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే కార్లకు నిర్బంధ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ కాలాన్ని మూడేళ్లు నుంచి నాలుగేళ్లకు, కొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్లు నుంచి ఆరేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించి తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్‌డిఏఐని ఆదేశించింది. అలాగే జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, వాహనాలు ఆగకుండా ప్రయాణించేలా 'ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రెకగ్నిషన్' సాంకేతికతతో కూడిన పైలట్ ప్రాజెక్టులను అమలు చేయాలని సూచించింది. ఇన్సూరెన్స్ నిబంధనల అమలును మరింత కఠినతరం చేసేందుకు 'వాహన్' డేటాబేస్ మరియు ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలను అనుసంధానించనున్నారు. రహదారులపై ఏర్పాటు చేసే ఏఎన్‌పీఆర్ కెమెరాల ద్వారా ఇన్సూరెన్స్ లేని వాహనాలను స్వయంచాలకంగా గుర్తించి, నేరుగా ఈ-చలాన్లు పంపే వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. వాహన తనిఖీల సమయంలో పోలీసులు కూడా ఇన్సూరెన్స్ స్టేటస్‌ను తక్షణమే తనిఖీ చేసేందుకు వీలుగా, 'వాహన్' పోర్టల్‌తో అనుసంధానించబడిన హ్యాండ్‌హెల్డ్ డివైజ్‌లు లేదా మొబైల్ యాప్‌లను పోలీసు సిబ్బందికి అందించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించింది. వాహనం ఉండి దానికి చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకపోతే ఇకపై పెట్రోల్ బంకుల్లో పెట్రోల్/డీజిల్ లభించకపోవచ్చు. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్ లేని వాహనాల సంఖ్యను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు, ఈ దిశగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ పంపుల్లో ఇంధనాన్ని నిరాకరించేలా ఒక ప్రత్యేక పైలట్ ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ లను కోర్టు ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
0 Comments