జమ్మూ కాశ్మీర్ లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఇద్దరు కార్మికులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అయితే ఇందులో ఓ మృతుడి కుటుంబ సభ్యులు కీలక విషయాలను వెల్లడించారు. ఉగ్రవాదులు కులం, ఐడెంటిటీ, కమ్యూనిటీ అడిగి మరీ చంపేశారని తెలిపారు. 2025 లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తరహాలోనే ఈ దాడి జరిగిందని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతేడాది ఏప్రిల్ 22 న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులందరినీ హిందువా..? కాదా..? అని అడుగుతూ చంపేసిన సంగతి తెలిసిందే. సౌత్ కాశ్మీర్ లోని కేలమ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో రఘువీర్, దీపక్ అనే ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా రఘువీర్ మాత్రం గాయలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అంతకుముందు 9 రోజుల క్రితమే జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఓ పోలీస్ అధికారిని ఉగ్రమూకలు కాల్చి చంపారు. అయితే ఈ ఉగ్రదాడిని దీపక్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుడి స్వగ్రామం బుందేలీలో అంత్యక్రియలు జరపనున్నట్లు తెలిపారు. దీపక్ బంధువు హల్దార్ మాట్లాడుతూ.. " దీపక్ గత 6 నెలలుగా అక్కడ పనిచేస్తున్నాడు. జూలై 31 న అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదుల దాడిలో దీపక్ గాయపడినట్లు మాకు సమాచారం వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు కులం, కమ్యూనిటీ ఏంటి..? అని అడిగి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు" అని హల్దార్ స్పష్టం చేశారు.
కుల్గామ్ ఉగ్రదాడి : కులం, ఐడెంటిటీ, కమ్యూనిటీ అడిగి చంపిన ఉగ్రవాదులు
السبت، 1 أغسطس 2026
and Community Identity Jammu and Kashmir Kulgam Terror Attack national Terrorists Killed Victims After Asking About Caste
ليست هناك تعليقات:
إرسال تعليق