నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, మంచుచరియల విరిగిపడిన ఘటనలో డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్‌ జి. సతీష్‌ రెడ్డి దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన 31 మంది సభ్యుల యాత్రికుల బృందంలో సతీష్‌ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. వీరు మానస సరోవర్‌ యాత్రకోసం సతీష్‌ రెడ్డి బృందం వెళ్లిన కొన్నిగంటల్లోనే వరదలు వచ్చాయి. నిన్న ఉదయమే వరదలు సంభవించి ప్రాంతాన్ని దాటి వచ్చారు. సతీష్‌ రెడ్డి బృందం ఆ ప్రాంతాన్ని దాటిన కొన్ని గంటలకే అక్కడ వరదలు సంభవించడం, పెద్ద ఎత్తున మంచుకొండ చరియలు విరిగిపడటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రమాదం నుంచి తమ బృందమంతా క్షేమంగా బయటపడినట్లు సతీష్‌ రెడ్డి స్వయంగా వెల్లడించారు. 'మేం 31 మంది యాత్రకు వెళ్లాం. భారీ మంచుకొండ చరియ విరిగిపడి వరదలు ముంచెత్తాయి. అయితే, మేము ఆ ప్రాంతాన్ని సకాలంలో దాటడంతో ప్రాణాపాయం తప్పింది. అందరం సురక్షితంగా ఉన్నాం. ప్రస్తుతం టిబెట్‌లోని సాగా అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడి నుంచి వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే భారత్‌కు చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం' అని ఆయన తెలిపారు.

Post a Comment

أحدث أقدم