మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ భద్రత భారీగా కుదింపు

الأحد، 30 أغسطس 2026

number of security personnel assigned to him will decrease from 58 to 33 Significant Reduction in Security for Former CM M.K. Stalin Tamil Nadu

t f B! P L

మిళనాడు మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు భద్రత కుదించారు. ఇప్పటివరకు కొనసాగుతున్న Z+ భద్రతను Z కేటగిరీకి తగ్గిస్తూ విజయ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్టాలిన్‌కు భద్రత కల్పించే సిబ్బంది సంఖ్య కూడా 58 నుంచి 33కి తగ్గనుంది. ఇంటెలిజెన్స్‌ నివేదికలు, ముప్పు అంచనాల ఆధారంగా భద్రతా సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే మాజీ సీఎం భద్రత తగ్గింపు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, భద్రతా విభాగం నిర్వహించిన క్రమబద్ధమైన సమీక్ష అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. తమిళనాడులో వీఐపీలు, వీవీఐపీలకు కల్పించే భద్రతను సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. ఇంటెలిజెన్స్‌ నివేదికలు, ముప్పు తీవ్రత, సంబంధిత వ్యక్తి ప్రజల్లో తిరిగే పరిస్థితి, ప్రయాణాల తీరు, భద్రత అవసరాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని భద్రతా కేటగిరీని కొనసాగించాలా? పెంచాలా? తగ్గించాలా? అన్నది నిర్ణయిస్తారు. Z+ భద్రతలో స్టాలిన్‌కు రోజువారీ రొటేషన్‌ పద్ధతిలో సుమారు 58 మంది సిబ్బంది భద్రత కల్పిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య 33కు తగ్గనున్నట్లు సమాచారం. అయితే కొన్ని నివేదికల్లో కొత్త Z కేటగిరీ కింద విధుల్లో ఉండే సిబ్బంది సంఖ్యను వేరుగా పేర్కొన్నారు. భద్రత పూర్తిగా తొలగించడం మాత్రం జరగలేదు. స్టాలిన్‌ కాన్వాయ్‌లో ముందు, మధ్య, వెనుక భాగాల్లో భద్రతా బృందాలను కొనసాగించనున్నారు. పైలట్‌, ఎస్కార్ట్‌, బ్యాకప్‌, క్లోజ్‌ ప్రొటెక్షన్‌ వాహనాలతో ఆయనకు రక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ