తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నై సమీపంలోని పుళల్ కేంద్ర కారాగారంతో పాటు పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జైలు ప్రాంగణానికి చేరుకున్న ఆయన ఖైదీలకు అందుతున్న ప్రాథమిక వసతులు, వైద్య సేవలు, విద్యావకాశాలు, వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలను స్వయంగా పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద జైలు కాంప్లెక్స్‌లలో ఒకటైన పుళల్‌లోని శిక్ష అనుభవిస్తున్న ఖైదీల బ్లాక్, రిమాండ్ ఖైదీల విభాగాలను సందర్శించి నేరుగా వారితో మాట్లాడి వారి సమస్యలను, వినతులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల సందర్భంగా జైలు ఆసుపత్రి, డీ అడిక్షన్ సెంటర్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ కాలేజ్ తరగతి గదులు, కంప్యూటర్ శిక్షణ కేంద్రం , పవర్‌లూమ్, టైలరింగ్ విభాగాలను సీఎం సందర్శించారు. ఖైదీలు స్వయంగా తయారు చేస్తున్న ఐరన్ రాక్స్, పేపర్ కవర్లు, ఆఫీస్ ఫైల్ ప్యాడ్స్ వంటి ఉత్పత్తులను పరిశీలించిన ఆయన, వారికి అందిస్తున్న ఆహార నాణ్యతను కూడా స్వయంగా తనిఖీ చేశారు. సత్ప్రవర్తనతో మారాలనుకునే ఖైదీలకు ఉన్నత చదువులు, వృత్తి శిక్షణ అందించే అవకాశాలను మరింత విస్తరించాలని జైళ్ల శాఖ డిజిపి ని విజయ్ ఆదేశించారు. జైలు సందర్శన ముగించుకుని తిరుగుపయనమైన ముఖ్యమంత్రి విజయ్.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా M3 పుళల్ పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టారు. స్టేషన్ పనితీరు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలు, అధికారిక రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఎలాంటి అనవసర జాప్యం లేకుండా వేగంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. స్టేషన్‌లోని సబ్-ఇన్స్పెక్టర్ గది, కంప్యూటర్ రూమ్, లాకప్ విభాగాలను తనిఖీ చేసిన ముఖ్యమంత్రి, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల కోసం కేటాయించిన తాగునీరు, సీటింగ్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక సదుపాయాల లభ్యతను కూడా పరిశీలించారు. నిందితులు లేదా బాధితులతో పోలీసులు నడుచుకునే తీరుపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఇలా ఎలాంటి హంగులు లేకుండా ఉన్నపళంగా జైలు, పోలీస్ స్టేషన్లను సందర్శించడం, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
పుళల్ కేంద్ర కారాగారంతో పాటు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీలు చేసిన ముఖ్యమంత్రి విజయ్
السبت، 29 أغسطس 2026
Chief Minister Vijay Conducts Surprise Inspections at Puzhal Central Prison educational opportunities he personally inspected the basic amenities medical services Police Station tamilnadu
ليست هناك تعليقات:
إرسال تعليق