తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పట్నం లావణ్య (30) బట్టలను ఉతికి ఆరవేయడానికి ఇంటి పక్కనే ఉన్న పశువుల షెడ్డు వద్దకు వెళ్ళింది. బట్టలు ఆరవేసుకోవడానికి పశువుల షెడ్డుకు ఉన్న సిమెంట్ స్తంభాలకు ఇనుప వైరుతో దండెన్ని ఏర్పాటు చేసుకున్నారు. పశువుల షెడ్డు లో వెలుతురు కోసమని ఇంట్లో నుండి వైర్ ద్వారా కరెంట్ తీసుకోవడం జరిగింది. విద్యుత్ వైరు తేలి దండెముకు తాకడాన్ని గుర్తించని లావణ్య బట్టలు ఆరవేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.
బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి
السبت، 29 أغسطس 2026
Chintakunta village crime Medak district Narsapur Mandal telangana Woman Dies of Electrocution While Hanging Clothes
ليست هناك تعليقات:
إرسال تعليق