మేధో సంపతి హక్కులు పొందిన భారతీయ కంపెనీలు వచ్చే 10 నుంచి 14 నెలల్లో ఈ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయని కేంద్ర ఐటి మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన రూ.62,500 కోట్ల మొబైల్ ఫోన్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఎంపిఎంఎస్) కింద మూడు కొత్త భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ పథకం కింద కేవలం కాపీ కొట్టిన డిజైన్లకు చోటు ఉండదని, కంపెనీలు తమ సొంత డిజైన్, ఐపి హక్కులను కలిగి ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ బ్రాండ్లు ఎకానమీ నుండి ప్రీమియం విభాగాల వరకు పోటీ పడతాయని, ము ఖ్యంగా ఎక్కువ అమ్మకాలు జరిగే హై-వాల్యూమ్ సెగ్మెంట్‌పై దృష్టి పెడతాయని మం త్రి పేర్కొన్నారు. దేశీయంగా తయారీని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, ప్రపంచ స్థాయిలో పోటీ పడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు. గతంలో 20 లక్షల కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, ఈ పథకం ద్వారా 40 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఎంపిఎంఎస్ స్కీమ్ కింద మూడు భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق