స్వీడన్ సెంట్రల్ ప్రాంతంలోని ఫాగెర్స్టా పట్టణంలో హైస్కూల్‌లో కత్తితో ప్రవేశించిన ఓ 18 ఏళ్ల యువకుడు విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దారుణ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వేసవి సెలవుల అనంతరం 'బ్రినెల్ హైస్కూల్' ఇటీవల పునఃప్రారంభమైంది. సుమారు 13 వేల జనాభా కలిగిన ఈ పట్టణంలోని పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. సెలవుల తర్వాత పాఠశాల తిరిగి తెరుచుకున్న తొలి రోజే ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సాయుధ బలగాలతో రంగంలోకి దిగి పాఠశాలను చుట్టుముట్టారు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతను గాయపడటంతో అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీస్ చీఫ్ టోమ్మి అల్రిక్సన్ తెలిపారు. కాగా, దాడికి పాల్పడిన యువకుడు గతంలో అదే పాఠశాలలో చదివిన మాజీ విద్యార్థిగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, మరొకరికి ప్రథమ చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. ఈ ఊహించని పరిణామానికి పాఠశాల ప్రాంగణం ఐదు గంటల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉండిపోయింది. రక్తపు మడుగులో పడివున్న క్షతగాత్రులను చూసి విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనపై స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన శనివారంనాటి ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. అలాగే స్వీడన్ రాజు కార్ల్ XVI గుస్తాఫ్, రాజకీయ నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిందితుడి సోషల్ మీడియా ఖాతాలు, ఈ దాడి వెనుకగల అసలు ఉద్దేశంపై పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
హైస్కూల్‌లో కత్తితో విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేసిన మాజీ విద్యార్థి : ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق