చేయి లేకపోయినా బ్రెయిన్ సిగ్నల్స్‌తో పనిచేసే రోబోటిక్ హ్యాండ్ : సైంటిస్టుల అద్భుత సృష్టి

الثلاثاء، 4 أغسطس 2026

A Robotic Hand Controlled by Brain Signals An Amazing Innovation by Scientists BrainCo bionic hand new wireless demo model showcased at the WAIC science technology

t f B! P L

చైనా తయారు చేసిన బ్రెయిన్‌కో బయోనిక్ చేయి వినియోగదారుడి చేయి లేకపోయినా సొంతంగా కదులుతుంది. కండరాలు, నాడుల నుంచి వచ్చే విద్యుత్ సంకేతాలను ఇది గుర్తిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆ సంకేతాలను రియల్ టైమ్‌లో వేగంగా విశ్లేషిస్తుంది. ఆ తర్వాత వైర్‌లెస్ ద్వారా కదలికలకు సంబంధించిన కమాండ్స్ ఆ రోబోటిక్ చేతికి అందుతాయి. దీంతో అందులోని ఒక్కో వేలు అత్యంత కచ్చితత్వంతో కదులుతుంది. వాస్తవానికి ఈ బయోనిక్ చేతికి 21 డిగ్రీల స్వేచ్ఛ ఉన్నట్టు బ్రెయిన్‌కో సంస్థ చెబుతోంది. అంతేకాకుండా అరచేతికి పూర్తి స్పర్శజ్ఞానం ఉండటం దీని మరో ప్రత్యేకత. దీనికి వాడిన సిలికాన్ కవచం నిజమైన మనిషి చర్మంలానే కనిపిస్తుంది. పైగా ఈ బయోనిక్ చేయి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఒక పెద్ద యాపిల్ పండు బరువుతో సమానం. చేతులు కోల్పోయిన దివ్యాంగులకు ఈ సరికొత్త బయోనిక్ చేయి నిజంగా ఒక వరం లాంటిది. వారు తమ రోజువారీ పనులను సులభంగా చేసుకునేందుకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ వస్తువునైనా సులువుగా పట్టుకోవడం, దానికి సంబంధించిన స్పర్శను గ్రహించడం దీని ద్వారా సాధ్యమవుతుంది. ఒక చిన్న ఈఈజీ హెడ్‌సెట్ ద్వారా మనిషి మెదడులోని సంకేతాలను ఈ పరికరం గ్రహిస్తుంది. నీళ్ల గ్లాసు పట్టుకోవాలన్నా, లేదా ఏదైనా వస్తువును తీయాలన్నా.. వినియోగదారుడి ఆలోచనను క్షణాల్లోనే కమాండ్స్‌గా మార్చి ఈ రోబోటిక్ చేయి పనిచేస్తుంది. బ్రెయిన్‌కో సంస్థ ఇప్పటికే దివ్యాంగుల కోసం బయోనిక్ చేతులను మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే డబ్ల్యూఏఐసీలో ప్రదర్శించిన ఈ సరికొత్త వైర్‌లెస్ డెమో మోడల్ ధరను కానీ, మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందనే విషయాన్ని కానీ కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ బయోనిక్ చేయి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ