తమిళనాడును బలహీనపరిచేలా డీలిమిటేషన్‌ బిల్లును రూపొందించారు !

السبت، 1 أغسطس 2026

called upon both national and regional parties to ensure the bill's defeat Delimitation Bill Drafted to Weaken Tamil Nadu national Rahul Gandhi

t f B! P L

నియోజకవర్గ పునర్విభజన బిల్లును  తమిళనాడు ప్రజాస్వామిక హక్కులను దూరం చేసే కుట్రగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. తమిళనాడును బలహీనపరిచేలా బిల్లును రూపొందించారని అన్నారు. ఈ బిల్లును వీగిపోయేలా చేయాలని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు పిలుపునిచ్చారు. బిల్లుకు మద్దతు ఇవ్వడమంటే తమిళనాడుకు ద్రోహం చేయడమేనని అన్నారు. తమిళనాడు వ్యక్తులు ఎవరూ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదని అన్నారు. ప్రతి వ్యక్తీ బిల్లును వ్యతిరేకించాలని అన్నారు. ప్రతి తమిళపార్టీ, జాతీయ పార్టీ బిల్లు వీగిపోయేలా చేయాలని కోరారు. ఇటీవల పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలోని పరిణామాల నేపథ్యంలో పార్లమెంటులో ఎన్డీయే బలం పెరిగిందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్ విభజన బిల్లులను పాస్ చేయించుకునేందుకు ప్రయత్నించవచ్చన్న కామెంట్స్ వినిపించాయి. ఇటీవల కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో డీఎంకే కూడా బిల్లు విషయంలో మెత్తబడే అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఇటీవల డీఎంకే నేత టీకేఎస్ ఈలంగోవన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్‌తో పునర్ విభజనకు లంకె పెట్టి బిల్లు పాస్ చేయించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ విషయంలో పలు పార్టీలు రకరకాల సూచనలు ఇచ్చాయని, అయితే, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల సీట్లపై ప్రభావం పడకూడదని అన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ