మిళ, తెలుగు చిత్రసీమలో నగేష్ హాస్యనటుడిగా, సహాయ నటుడిగా, కథానాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నటనా రంగంలో రూపం, ఆహార్యం కంటే ప్రతిభే ముఖ్యమని నిరూపించిన గొప్ప నటుడు నగేష్. తమిళనాడులోని ధారాపురంలో జన్మించిన నగేష్, చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి చూపారు. కష్టపడి చదువుకుని మద్రాసు చేరి, అక్కడ రైల్వే క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించారు. ఈ సమయంలోనే నాటకాల పట్ల ఆయనకు అభిరుచి పెరిగింది. రైల్వే అసోసియేషన్ నిర్వహించిన నాటకాలలో చురుకుగా పాల్గొని తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఒకానొక సందర్భంలో ఎం.జి.ఆర్. ఒక నాటకాన్ని చూసి నగేష్ నటనా శైలిని, ఆయన డైలాగ్ డెలివరీని, హావభావాలను ప్రశంసించారు. ఆయన సినీరంగంలో రాణిస్తారని చెప్పిన మాట నగేష్‌ను సినిమాల వైపు వెళ్ళేటట్లు చేసింది. తొలిదశలో చిన్న చిన్న వేషాలతో ప్రారంభించి, క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన “సర్వర్ సుందరం” ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. తమిళ చిత్రసీమలో అగ్రతారలైన ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, జెమిని గణేశన్ వంటి వారందరి లలోనూ నగేష్ నటించారు. ఆయన టైమింగ్, నృత్యాలు తెలుగులో రాజబాబు వంటి హాస్యనటులను ప్రభావితం చేశాయి. వెయ్యికి పైగా చిత్రాలలో నటించి, సినీ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. అనేక చిత్రాల్లో నటించి తెలుగు వారి మొప్పు పొందారు. నగేష్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. ఒకానొక సందర్భంలో ఎం.జి.ఆర్.తో విభేదాలు ఏర్పడ్డాయి. పాండి బజార్‌లో ఆయన నిర్మించిన థియేటర్ నిర్మాణం పన్నుల సమస్యలతో నిలిచిపోవడం కూడా ఆయన్ని ఆర్థికంగా దెబ్బతీసింది. అత్యంత బాధాకరమైన సంఘటన ఏమిటంటే, తన తల్లి రుక్మిణమ్మకు ఎంతో ఇష్టంగా కొనిచ్చిన కారులోనే ఆమె మరణించడం. ఈ సంఘటన ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఒక్కగానొక్క కొడుకు ఆనంద్‌ను హీరోగా నిలబెట్టడానికి ఎంతో కష్టపడ్డారు. అతని చిత్రాల నిర్మాణం కోసం తన ఆస్తులను కోల్పోయారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన పెట్టుబడులు కూడా నష్టాలను మిగిల్చాయి. వరుస ఆర్థిక నష్టాలు, కుటుంబ కష్టాలు ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. 2009 జనవరి 1వ తేదీన, 75వ ఏట గుండెపోటుతో నగేష్ తుది శ్వాస విడిచారు. 

Post a Comment

أحدث أقدم