దేశవ్యాప్తంగా ఉన్న యువత, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు వీలుగా దేశవ్యాప్త 'లిజనింగ్ టూర్' ప్రారంభించనున్నట్లు కాకరోచ్ జనతా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో బుధ, గురు వారాల్లో రెండు రోజుల వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీ స్థాపకుడు అభిజీత్ దిప్కే , అధికార ప్రతినిధులు మరియు ప్రాథమిక స్థాయిలో కీలక పాత్ర పోషించిన నాయకులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్న 50 మంది వాలంటీర్లతో విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని యువత, విద్యార్థుల ఆకాంక్షలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. రెండు నెలల పాటు సాగిన నీట్ వ్యతిరేక ఆందోళనల ఫలితంగా అప్పటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని తమ పోరాట విజయంగా సీజేపీ పేర్కొంది. యువత ఏకమైతే ఎలాంటి మార్పునైనా సాధించవచ్చనే నమ్మకం పెరిగిందని, ఆ ఉత్సాహాన్ని సరైన దిశలో నడిపించేందుకే ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు సీజేపీ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, రూట్ మ్యాప్‌ను విడుదల చేయనున్నారు.
దేశవ్యాప్త 'లిజనింగ్ టూర్' ప్రారంభించనున్నట్లు ప్రకటించిన కాకరోచ్ జనతా పార్టీ
الثلاثاء، 4 أغسطس 2026
Cockroach Janata Party Announces Nationwide 'Listening Tour' maharashtra national two-day strategic meeting in Chhatrapati Sambhajinagar
ليست هناك تعليقات:
إرسال تعليق