ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 3 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ రెండో వారం నుంచి అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలతో పాటు ఇతర వర్గాల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. పింఛను కోసం దరఖాస్తు చేసుకోదలచిన వారు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో నేరుగా సంప్రదించి ఫారాలు అందజేయవచ్చు లేదా ప్రభుత్వం అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు (బియ్యం కార్డు), ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయస్సు నిర్ధారణ పత్రాలతో పాటు దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్, చేనేత, గీత కార్మికులైతే సంబంధిత వృత్తి ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారికి త్వరితగతిన పింఛన్ మంజూరు చేసి నేరుగా వారి ఖాతాల్లోకి లేదా ఇంటి వద్దకే పింఛన్ సొమ్మును అందజేస్తారు.
కొత్త పింఛన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ : సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق