సెప్టెంబర్ 4న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ని విడుదల

السبت، 29 أغسطس 2026

Infinix Hot 70 Pro 5G Smartphone Launching on September 4 slim 7.85mm body technology the phone will sport a 6.76-inch Full-HD+ display with a 144Hz refresh rate

t f B! P L

దేశీయ మార్కెట్లో సెప్టెంబర్ 4న ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ ని విడుదల చేయనున్నది.  దీనికి సంబంధించిన టీజర్లు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. 7.85 మిమీ సన్నని బాడీతో వస్తున్న ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.76-అంగుళాల ఫుల్-HD+ డిస్‌ప్లేను అందించనున్నారు. వెనుక వైపు ఆకట్టుకునే 'యాక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్' LED లైటింగ్‌ను కూడా ప్రమోషన్లలో హైలైట్ చేస్తున్నారు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కు రానుంది. ఫోన్ వెనుక ఉండే ఈ మిని డాట్-మాట్రిక్స్ లైట్, నోటిఫికేషన్లు, ఛార్జింగ్, మ్యూజిక్ ప్లే అవుతున్న సమయంలో బ్లింక్ అవుతుంది. దీనివల్ల మెయిన్ స్క్రీన్‌ను ఆన్ చేయాల్సిన అవసరం లేకుండానే ముఖ్యమైన సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో థెర్మో ఆరెంజ్, మిరాజ్ గ్రీన్ వంటి కలర్ వేరియంట్లలో వచ్చిన ఈ ఫోన్, అదే వైబ్రెంట్ లుక్‌తో ఇండియాలోనూ అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇన్ఫినిక్స్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఈ ఫోన్ ల్యాండింగ్ పేజీలు లైవ్‌లోకి వచ్చాయి. లాంచ్ రోజైన సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. ధర, వేరియంట్‌ల ప్రకటనతో పాటే ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. బడ్జెట్ ధరలోనే 144Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఇస్తుండటంతో గేమర్స్, స్మూత్ స్క్రోలింగ్ కోరుకునే వినియోగదారులను ఈ ఫోన్ బాగా ఆకట్టుకోనుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ