అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్లు మరో మూడు పతకాలు సాధించారు. 68 కేజీల విభాగం స్వర్ణ పతక పోరులో చైనాకు చెందిన చెన్‌లింగ్ సాంగ్ చేతిలో 1-2 స్వల్ప తేడాతో పోరాడి ఓడిన మాన్సి లాథర్ రజత పతకంతో సరిపెట్టుకుంది. 57 కేజీల విభాగంలో తన్వీ మగ్దుమ్ 10-4 పాయింట్ల తేడాతో అగ్నియా (కెనడా)పై గెలుపొందగా, 59 కేజీల విభాగంలో కోమల్ 5-2తో ఎడా బాలాజ్ (హంగేరీ)ని చిత్తుచేసి కాంస్య పతకాలను దక్కించుకున్నారు. అంతకుముందు శుక్రవారం జరిగిన 76 కేజీల విభాగం ఫైనల్లో 18 ఏళ్ల కాజల్ దోచాక్ 7-0తో చైనాకు చెందిన జింగ్రూ సన్‌ను చిత్తుచేసి స్వర్ణ పతకం గెలుచుకుని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అలాగే, తను శర్మ (72 కేజీలు), సవిత (62 కేజీలు) ఫైనల్స్ లో జపాన్ రెజ్లర్ల చేతిలో ఓడిపోయి రజత పతకాలకు పరిమితమయ్యారు. టోర్నీ చివరి దశకు చేరుకోగా, తదుపరి పురుషుల ఫ్రీస్టైల్ 57, 65, 79, 92 కేజీల విభాగాల్లో భారత రెజ్లర్లు పోటీపడనున్నారు.
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ : సత్తా చాటుతున్న మహిళా రెజ్లర్లు
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق