స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారుల కోసం సర్వీస్ ఛార్జీలను సవరించింది. అక్టోబర్ 1, 2026 నుంచి ఈ నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పుల ప్రకారం బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు ఓ నెలలో నాలుగుసార్ల కంటే ఎక్కువ సార్లు నగదు విత్‌డ్రా చేస్తే అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి ఛార్జీలు లేదా రుసుముల భారం లేకుండా, సమాజంలోని పేద వర్గాలను పొదుపు ప్రారంభించేలా ప్రోత్సహించడానికి ఈ ఖాతాలు ప్రధానంగా ఉద్దేశించబడ్డాయి. అక్టోబర్ 1, 2026 నుంచి ఒక నెలలో మొదటి నాలుగు ఉచిత విత్‌డ్రాల తర్వాత చేసే ప్రతి నగదు విత్‌డ్రా లావాదేవీకి రూ.15తో పాటు జీఎస్టీ ఛార్జీ విధించబడుతుంది. బ్యాంకు బ్రాంచ్ లేదా ఏటీఎం ద్వారా నగదు తీసుకున్నా ఈ రుసుము వర్తిస్తుంది. గతంలో మొదటి నాలుగు ఉచిత లావాదేవీలను లెక్కించేటప్పుడు డిజిటల్ లావాదేవీలకు మినహాయింపు ఉండేది.అయితే ఎస్బీఐ సవరించిన నిబంధనలలో ఈ మినహాయింపును ఇప్పుడు తొలగించారు. ఈ నిబంధనల మార్పు వల్ల ప్రధానంగా ఎస్బీఐలోని బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (జీరో బ్యాలెన్స్) ఖాతాదారులు ప్రభావితమవుతారు. సమాజంలోని పేద, అల్పాదాయ వర్గాలను పొదుపు వైపు ప్రోత్సహించేందుకు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ నిబంధనలు లేకుండా ఈ ఖాతాలను ప్రవేశపెట్టారు. అయితే ఈ ఖాతాతో పాటు చెక్ బుక్ రాదు. బ్రాంచ్‌లో విత్‌డ్రాయల్ ఫారం లేదా ఏటీఎం ఉపయోగించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారునికి ఒక బేసిక్ రూపే ఏటీఎం-కమ్-డెబిట్ కార్డ్ జారీ చేయబడుతుంది. ఈ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను తెరిచే కస్టమర్లకు మరే ఇతర సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండకూడదు. ఒకవేళ కస్టమర్‌కు ఇప్పటికే సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్నట్లయితే బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాను తెరిచిన 30 రోజులలోపు దానిని తప్పనిసరిగా మూసివేయాలి. ఈ కస్టమర్లకు ప్రాథమిక RuPay ATM-కమ్-డెబిట్ కార్డ్ ఉచితంగా జారీ చేయబడుతుంది. వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలు ఉండవు. NEFT/RTGS వంటి ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాల ద్వారా చేసే డిపాజిట్లపై కూడా ఎలాంటి ఛార్జీలు ఉండవు. యాక్టివ్ గా లేని ఖాతాలను తిరిగి యాక్టివ్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు ఉండవు, కానీ వాటిని మూసివేయడానికి ఛార్జీలు ఉంటాయి.
Random Post
إجمالي مرات مشاهدة الصفحة
Configure Archive
بحث هذه المدونة الإلكترونية
AsSencse 2
About Us
AP TO TG COMPUTER TECH
ver-1
1
Footer Menu Widget
About Me
نموذج الاتصال
No Thumbnail
Categories
Main Tags
Translate
#Advertisement
Featured Posts
{getFeatured} $label={recent} $region={Andhra Pradesh}
#Advertisement
8/related/default
ليست هناك تعليقات:
إرسال تعليق