Ad Code

18 ఏళ్లకే ప్రొఫెసర్ అయిన నాథన్ థామస్ : గిన్నీస్ వరల్ రికార్డ్‌లో చోటు సంపాదించిన నాథన్

మెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ 18 ఏళ్ల వయసులో కళాశాల ప్రొఫెసర్‌గా మారి చరిత్ర సృష్టించాడు. కేవలం 18 సంవత్సరాల 346 రోజుల వయసులో అధ్యాపకుడయ్యారు. ప్రపంచంలోనే అతి పిన్న వయసు పురుష ప్రొఫెసర్‌గా గిన్నీస్ వరల్ రికార్డ్‌లో చోటు సంపాదించాడు. 306 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డును బద్దలు కొట్టాడు. నాథన్ 10 ఏళ్లకే మియామి డేడ్ కాలేజీలో డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమం ద్వారా కళాశాలలో చేరాడు. అనంతరం ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీలు చేశాడు. ఆ తర్వాత మియామి డేడ్ కాలేజీలోనే ఇంజినీరింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేరి విద్యార్థులకు బోధించడం ప్రారంభించాడు. తనతో సమాన వయసు ఉన్న విద్యార్థులకు బోధిస్తున్నాడు. 1717లో స్కాట్లాండ్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త కొలిన్ మెక్‌లారిన్ 19 ఏళ్ల వయసులో ప్రొఫెసర్‌గా నియమితులై రికార్డు సృష్టించగా ఇప్పుడు దాన్ని నాథన్ చెరిపేశాడు.

Post a Comment

0 Comments

Close Menu