ఇండోనేషియాలో మళ్లీ భారీ భూకంపం వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 7.7 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత 10 గంటల వ్యవధిలోనే మరో భారీ భూకంపం రావటంతో జనం విలవిలలాడుతున్నారు. ఇండోనేషియా ఉత్తర సుమత్రా దీవుల్లో 6.8 తీవ్రతతో రెండో భూకంపం రావటంతో దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. భూమికి 163 కిలోమీటర్ల లోతులో.. ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెన్స్ ప్రకటించింది. ఈరోజు తెల్లవారుజామున వచ్చిన భూకంపం 38 మందిని బలిగింది. ఆ తర్వాత మళ్లీ 6.8 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అక్కడి జనాలు ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. రెండు సార్లు భూకంపంతో కొండచరియాలు విరిగిపడగా.. పవర్ కట్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినట్లు స్థానిక మీడియ తెలిపింది. రోడ్లపైన కొండ చరియలు విరిగిపడటంతో రవాణా అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. భూకంపంతో దాదాపు 2 వేల మందిని ఖాళీ చేయించినట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ భూకంపానికి కారణం.. ఇండోనేషియా కింద భూ పలకల అడ్జస్ట్మెంట్ వలన సంభవించినట్లు భూకంప కేంద్రం పేర్కొంది.

Post a Comment

أحدث أقدم