Ad Code

బీహార్‌కు చెందిన నలుగురు బాలికలు సురక్షితం : పటాన్‌చెరు పోలీసులు వెల్లడి

స్నాపూర్‌లో అదృశ్యమైన బీహార్‌కు చెందిన నలుగురు బాలికలు సురక్షితంగా ఉన్నారని పటాన్‌చెరు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మరికాసేపట్లో తల్లిదండ్రులకు ఆ బాలికలను అప్పగిస్తామని తెలిపారు. వీరిని సికింద్రాబాద్‌లో గుర్తించి అదుపులోకి తీసుకున్నామని వివరించారు. జులై 23వ తేదీన పాఠశాలకు వెళ్తున్నామని వారు ఇంట్లో చెప్పి.. వెళ్లారు. ఆ తర్వాత వారు ఇంటికి వెళ్లలేదు. వీరంతా ఇస్నాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు ఆరా తీశారు. అయితే ఆ రోజు వారు పాఠశాలకు రాలేదని సిబ్బంది వెల్లడించారు. దీంతో తలిదండ్రులు.. పటాన్ చెరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఇస్నాపూర్ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. వారంతా సికింద్రాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలోని పోలీసులను అప్రమత్తం చేశారు. మిస్సింగ్ అయిన విద్యార్థినులు కుష్బూ కుమారి (16), మహిమా కుమారి (12), రోజా కుమారి (12), ప్రియ కుమారిగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌కు చెందిన పలు కుటుంబాలు ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాయి. ఆ కుటుంబాలు ఇస్నాపూర్‌ ప్రాంతంలో నివసిస్తున్నాయి. ఆయా కుటుంబాలకు చెందిన బాలికలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Post a Comment

0 Comments

Close Menu