హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అజిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 'ది హిందూ' కథనం ప్రకారం.. ఫేజ్-2 పనులను, ముఖ్యంగా పాతబస్తీ, ఎయిర్‌పోర్ట్ రూట్లలో ఉన్న భూసేకరణ అడ్డంకులను వేగంగా క్లియర్ చేయడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలక నియామకం చేపట్టారు. హైదరాబాద్ మహానగరానికి జీవనాడి లాంటి మెట్రో ఫేజ్-2 పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైన పాతబస్తీ మెట్రో, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీకి ఉన్న అడ్డంకులను తొలగించే దిశగా కీలక అడుగు పడింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అజిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఫేజ్-2 పనులను, ముఖ్యంగా భూసేకరణ లాంటి సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించి పనులను వేగవంతం చేయడానికి రేవంత్ సర్కార్ వేసిన పక్కా స్కెచ్ ఇది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర సాగే పాతబస్తీ కనెక్టివిటీ, అలాగే నాగోల్-శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కారిడార్ అత్యంత కీలకమైనవి. ఈ కారిడార్లలో భూసేకరణ అధికారులకు అతిపెద్ద సవాలుగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాతబస్తీ మెట్రో విషయంలో మజ్లిస్ పార్టీ ఒత్తిళ్లతో మీనమేషాలు లెక్కించిందనే విమర్శలు ఉన్నాయి. అలైన్‌మెంట్ మార్పులు, స్థానికుల వ్యతిరేకత, భూసేకరణ వివాదాలతో ప్రాజెక్టును నత్తనడకన సాగించారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో తన మార్క్ చూపించాలంటే ఫేజ్-2 త్వరగా పూర్తి కావాలి. అందుకే, బ్యూరోక్రసీని ప్రక్షాళన చేస్తూ, మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారులను కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నారు. పైకి సాధారణ బదిలీలా కనిపిస్తున్న దీని వెనుక ఉన్న అసలు కథను నిక్కచ్చిగా విశ్లేషిస్తోంది ఇండియా హెరాల్డ్. పాత అధికారుల స్థానంలో దూకుడుగా పనిచేసే కొత్త టీమ్‌ను రంగంలోకి దించడం ద్వారా, ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని సీఎం వ్యూహరచన చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అడిషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అజిత్ రెడ్డి
الخميس، 2 يوليو 2026
Additional Managing Director of Hyderabad Metro Rail Limited Ajith Reddy Appointed expedite Phase-2 works specifically to swiftly clear land acquisition telangana
ليست هناك تعليقات:
إرسال تعليق