యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదాన్ని స్వాగతించిన ప్రధాని నరేంద్ర మోడీ

الجمعة، 31 يوليو 2026

He pledged to make the country's examination system more robust national Prime Minister Narendra Modi Welcomes Passage of Anti-Paper Leak Bill

t f B! P L

పార్లమెంట్ యాంటీ పేపర్ లీక్ బిల్లును ఆమోదించడాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో పరీక్షల వ్యవస్థను మరింత దృఢంగా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం పొందడం భారత్‌కు ఒక చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. 'వికసిత్ భారత్' స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి దేశమంతా కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్న ఆయన, పరీక్షల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేపర్ లీక్ ఘటనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే పరీక్షల సంస్కరణలను తీసుకురావడం అనివార్యమైందని ఆయన గుర్తుచేశారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు మనకు కఠినమైన చట్టాలు అవసరం. అందుకే మేము పార్లమెంట్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టాము. నేను మీకు మాట ఇచ్చినట్లే, పెద్ద సంఖ్యలో ఎంపీల భాగస్వామ్యంతో పార్లమెంట్‌లోని ఉభయ సభలు దీనిపై సుదీర్ఘంగా చర్చించాయి" అని ప్రధాని తన 2.26 నిమిషాల వీడియోలో తెలిపారు. కఠిన నిబంధనలతో కూడిన ఈ బిల్లును నేడు ఉభయ సభలు ఆమోదించాయి. నమ్మకమైన పరీక్షల వ్యవస్థను పునరుద్ధరించే దిశగా ఇప్పుడు ఒక ముఖ్యమైన అడుగు పడింది. ఈ దిశగా పనులు కొనసాగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితిని మేము ఎక్కువ కాలం కొనసాగనివ్వము. మిత్రులారా ఇదే నమ్మకంతో 'వికసిత్ భారత్' కలను సాకారం చేయడానికి తోడుగా ముందుకు సాగుదాం అని ఆయన అన్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ