టెలివిజన్ ఛానళ్ళ రేటింగ్, ర్యాంకింగ్స్ విధానాన్ని తక్షణమే నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ

الاثنين، 6 يوليو 2026

all entertainment channels and sports Centre issues orders to immediately halt television channel rating and ranking systems including general entertainment movies national

t f B! P L

దేశంలోని అన్ని రకాల టెలివిజన్ ఛానళ్ల రేటింగ్స్, ర్యాంకింగ్స్ విధానాన్ని తక్షణమే నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలోనే తీవ్ర వివాదాల నేపథ్యంలో కేవలం న్యూస్ ఛానళ్ల రేటింగ్స్‌ను నిలిపివేసిన కేంద్రం.. ఇప్పుడు తాజాగా జనరల్ ఎంటర్ టెయిన్‌మెంట్ , సినిమా, స్పోర్ట్స్ సహా అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్ల వీక్షక రేటింగ్స్ ప్రకటనను కూడా పూర్తిగా నిలిపివేస్తూ ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ఛానళ్లు అనుసరిస్తున్న అనుచిత, అక్రమ పద్ధతులు ప్రధాన కారణం. బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ లెక్కిస్తున్న ప్రస్తుత బార్-ఓ-మీటర్ల వ్యవస్థను కొన్ని పెద్ద నెట్‌వర్క్‌లు మేనేజ్ చేస్తున్నాయని, తప్పుడు పద్ధతుల్లో రేటింగ్స్ పెంచుకుని ప్రకటనదారులను ( మోసం చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేవలం రేటింగ్స్ రేసులో ముందంజలో ఉండటం కోసమే ఛానళ్లు కంటెంట్ నాణ్యతను దిగజారుస్తున్నాయని, సమాజంపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ లోపభూయిష్టమైన టీఆర్‌పీ రేటింగ్ విధానం స్థానంలో సంపూర్ణ పారదర్శకతతో కూడిన సరికొత్త ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతిక నిపుణులు, ఐటీ రంగ నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం డిజిటల్ సెట్-టాప్ బాక్సుల ద్వారా వచ్చే డేటాను రియల్-టైమ్‌లో పారదర్శకంగా క్రోడీకరించే కొత్త విధానాన్ని ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం పరిశీలిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం టెలివిజన్ ఇండస్ట్రీని, అడ్వర్టైజింగ్ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే, ఏటా వేల కోట్ల రూపాయల ప్రకటనల వ్యాపారం పూర్తిగా ఈ రేటింగ్స్ ఆధారంగానే జరుగుతుంది. కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చే వరకు రేటింగ్స్ నిలిపివేయడం వల్ల ఛానళ్ల ఆదాయంపై తాత్కాలిక ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో ఇది మీడియా రంగంలో ఆరోగ్యకరమైన పోటీకి, క్వాలిటీ కంటెంట్‌కు దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరికొత్త గైడ్‌లైన్స్ ఖరారైన తర్వాతే రేటింగ్స్‌పై తదుపరి స్పష్టత రానుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ