సుప్రీంకోర్టులో బెంచ్‌పై పేపర్లు విసిరిన పిటిషనర్ : బలవంతంగా కోర్టు హాలు నుండి వెలుపలికి పంపించేసిన సెక్యూరిటీ సిబ్బంది

الجمعة، 10 يوليو 2026

national Petitioner hurls papers at the bench in Supreme Court security personnel forcibly remove him from the courtroom

t f B! P L

సుప్రీంకోర్టులో శుక్రవారం ఊహించని విధంగా అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక కేసు విచారణ జరుగుతుండగా, పిటిషనర్ న్యాయస్థానంలో హద్దులు మీరి ప్రవర్తించాడు. ఆవేశంతో ఊగిపోతూ న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తన చేతిలో ఉన్న కేసు పత్రాలను వారి వైపు విసిరికొట్టి తీవ్ర గందరగోళం సృష్టించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కోర్టు సెక్యూరిటీ సిబ్బంది, అతడిని బలవంతంగా కోర్టు హాలు నుండి వెలుపలికి పంపించేశారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రబల్ ప్రతాప్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు రాగా, పిటిషనర్ స్వయంగా కోర్టుకు హాజరై వాదనలు వినిపించాడు. అయితే, విచారణ మొదలవుతూనే ఆయన న్యాయమూర్తులను ఉద్దేశించి 'జ్యుడీషియల్ సర్వెంట్' అని సంబోధిస్తూ 'లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసిన జస్టిస్ విశ్వనాథన్.. "మమ్మల్ని ఆదేశిస్తున్నావా?" అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రబల్ ప్రతాప్, కోర్టు రూమ్‌లోనే గట్టిగా అరుస్తూ తన చేతిలోని ఫైళ్లను గాల్లోకి విసిరేశాడు. అంతేకాకుండా, ఆ సమయంలో ఆ బెంచ్‌లో లేని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను సైతం దూషించడం ప్రారంభించాడు. ఈ అనాగరిక ప్రవర్తనతో కోర్టు హాలులోని వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని బయటకు లాక్కెళ్లారు. ఒక సైబర్ క్రైమ్ ముఠాకు సంబంధించిన కేసులో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 173(4) కింద తాను ఇచ్చిన దరఖాస్తును ప్రైవేట్ ఫిర్యాదుగా మార్చడాన్ని సవాల్ చేస్తూ ప్రబల్ ఈ పిటిషన్ వేశాడు. కాగా, కోర్టు హాలులో జరిగిన ఈ అసాధారణ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ