అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చేసిన సంతకం “విలువలేనిది, చెల్లనిది” అని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఒప్పంద నిబంధనలను ఉల్లంఘిస్తూ యుద్ధాన్ని రెచ్చగొడుతోందని ఆయన మండిపడ్డారు. అమెరికా వైఖరిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికాను తీవ్ర పదజాలంతో దూషించిన ఖమేనీ, వాషింగ్టన్ తీరును 'సైతాన్' చర్యలతో పోల్చారు. బలవంతం, ఆధిపత్య ధోరణి, క్రూరత్వం, విశ్వసనీయత లోపించడం అమెరికా నైజమని ఆరోపించారు. అమెరికా నిరంతరం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నందున, తాము కూడా తాత్కాలిక ఒప్పందానికి కట్టుబడబోమని, ఆ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ స్పష్టం చేశారు. యుద్ధానికి దిగితే అమెరికాకు ప్రతిఘటన శక్తులు మరపురాని పాఠం చెబుతాయని ఖమేనీ హెచ్చరించారు.
తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చేసిన ట్రంప్ సంతకం విలువలేనిది, చెల్లనిది : ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق