సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న మోడీ వ్యాఖ్యలు : ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కరణ్ జోహార్

الأربعاء، 8 يوليو 2026

cinema he mentioned Bollywood movie Kuch Kuch Hota Hai Karan Johar extends special thanks to the Prime Minister Modi's remarks trend on social media national

t f B! P L

ఇండోనేసియా రాజధాని జకార్తాలో నిర్వహించిన భారతీయ సమాజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. భారత్, ఇండోనేసియా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతూ ఆయన బాలీవుడ్ ఐకానిక్ మూవీ 'కుచ్ కుచ్ హోతా హై' ప్రస్తావన తీసుకురావడంతో సదస్సులో నవ్వులు పూశాయి. దీనిపై ఆ చిత్ర దర్శకుడు, బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ స్పందిస్తూ ప్రధానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇండోనేసియాలో భారతీయ సినిమాలకు, ముఖ్యంగా బాలీవుడ్ పాటలకు ఉన్న విపరీతమైన ఆదరణను ప్రధాని మోడీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. "ఇక్కడ భారత్‌కు చెందిన 'కుచ్ కుచ్ హోతా హై' పాట చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రోజు నేను ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ఒక మాట చెప్పాను. భారత్, ఇండోనేసియా రెండు దేశాలూ కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడు అది కేవలం 'కుచ్ కుచ్' (కొంచెం కొంచెం) దగ్గరే ఆగిపోదు, అంతకు మించి 'బహుత్ కుచ్' (చాలా ఎక్కువ) సాధించవచ్చు" అని ప్రధాని మోడీ చమత్కరించారు. రెండు దేశాల బంధాన్ని సినిమా టైటిల్‌తో ముడిపెడుతూ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలకు అక్కడి ప్రేక్షకుల నుండి భారీ చప్పట్లు, రెస్పాన్స్ వచ్చాయి. ప్రధాని మోడీ ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కరణ్ జోహార్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. "మన గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ గారు జకార్తాలో 'కుచ్ కుచ్ హోతా హై' గురించి మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్ని, గౌరవాన్ని ఇచ్చింది. అన్నిటినీ దాటి ప్రవహించే ఒకే ఒక్క భాష ఉంది.. అదే 'ప్రేమ'. మా సినిమా పాటను ఆదరించినందుకు, అది ఎప్పటికీ నిలిచిపోయేలా చేసినందుకు ధన్యవాదాలు" అని కరణ్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ