దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ తన ప్రముఖ ఎస్‌యూవీలు హారియర్, సఫారీలకు కొత్త 2026 స్టెల్త్ ఎడిషన్ ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన మ్యాట్ స్టెల్త్ బ్లాక్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, 13 JBL స్పీకర్ సౌండ్ సిస్టమ్, లెవెల్-2 ADAS వంటి అత్యాధునిక ఫీచర్లతో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త స్టెల్త్ ఎడిషన్ హారియర్‌లోని Fearless Ultra, సఫారీలోని Accomplished Ultra వేరియంట్ల ఆధారంగా రూపొందించారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ తో ఈ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 2026 టాటా హారియర్ స్టెల్త్ ఎడిషన్ ధర రూ.23.43 లక్షల నుంచి రూ.26.01 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. 2026 టాటా సఫారీ స్టెల్త్ ఎడిషన్ ధర రూ.24.09 లక్షల నుంచి రూ.26.76 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు నిర్ణయించారు. గతంలో కూడా స్టెల్త్ ఎడిషన్‌ను పరిమిత సంఖ్యలో విడుదల చేసిన టాటా మోటార్స్, ఈసారి మరింత ఆధునిక ఫీచర్లతో కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ మ్యాట్ స్టెల్త్ బ్లాక్ ఎక్స్‌టీరియర్. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌కు కూడా మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. దీంతో ఎస్‌యూవీకి మరింత స్పోర్టీ, ప్రీమియం లుక్ వచ్చింది. క్యాబిన్‌లో పూర్తి బ్లాక్ థీమ్‌ను అందించారు. కార్బన్ నోయిర్ లెదరెట్ సీట్లు, సర్దుబాటు చేయగల సెంటర్ ఆర్మ్‌రెస్ట్, పవర్డ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ఉన్నాయి. అదనంగా నాలుగు టెర్రైన్ మోడ్‌లతో కూడిన టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌ను కూడా అందించారు. దీంతో వివిధ రకాల రోడ్లపై డ్రైవింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉంటుంది. కొత్త హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్‌లో 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఇది వైర్‌లెస్ Apple CarPlay, Android Autoకు సపోర్ట్ చేస్తుంది.
టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల
الجمعة، 10 يوليو 2026
automobile business new Stealth Edition is based on the 'Fearless Ultra' variant of the Harrier and the 'Accomplished Ultra' variant of the Safari Tata Harrier and Safari Stealth Edition Launched
ليست هناك تعليقات:
إرسال تعليق