తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెం పరిధిలోని హేజేలో ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా అందులో నుంచి వెలువడిన రసాయన విష వాయువులను పీల్చి కార్మికుడు మృతిచెందాడు. గురువారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా, కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని బయటకు రాకుండా దాచిపెట్టింది. ఏపీలోని అనంతపురం జిలి్లా సింగనమల మంలడం ఉల్లికల్లు గ్రామానికి చెందిన అలుమూరు కృష్ణారెడ్డి (42) హెజేలో కంపెనీలో పనిచేస్తున్నాడు. కొత్త మందుల బ్యాచ్ తయారీ కోసం గురువారం సాయంత్రం రికార్టర్లను శుభ్రం చేస్తుండగా అందులో నుంచి వెలువడిన విష వాయువులను పీల్చడంతో కృష్ణారెడ్డి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే కృష్ణారెడ్డిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి హుటాహుటిన తరలించగా అప్పటికే కృష్ణారెడ్డి మరణించాడని వైద్యులు నిర్ధారించారు. కృష్ణారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, మృతుడి కుటుంబానికి యాజమాన్యం కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కృష్ణారెడ్డి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రియాక్టర్లను శుభ్రం చేస్తుండగా వెలువడిన విష వాయువులు : పీల్చిన కార్మికుడు మృతి
الجمعة، 17 يوليو 2026
Hejelo Laboratories located in Dhothigudem within the Bhoodan Pochampally Mandal of Yadadri Bhuvanagiri district telangana Worker Dies After Inhaling Toxic Gases Released During Reactor Cleaning
ليست هناك تعليقات:
إرسال تعليق