ఫిఫా ప్రసార హక్కులను దక్కించుకున్న జీ మీడియా సంస్థ !

الاثنين، 1 يونيو 2026

eight-year agreement has been finalized between FIFA and Zee national sports Zee Media Secures FIFA Broadcasting Rights

t f B! P L


ఫిఫా ప్రపంచకప్ ప్రసార హక్కులను జీ మీడియా సంస్థ సొంతం చేసుకుంది. ఈ ప్రసార హక్కులను తక్కువ ధరకే దక్కించుకోవాలనుకున్న జియో హాట్‌స్టార్ వ్యూహాన్ని జీ మీడియా తిప్పికొట్టింది. ఫిఫా, జీ మధ్య 8 ఏళ్ల కాలానికి ఒప్పందం కుదిరింది. 2034 వరకూ భారత్‌లో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను జీ సంస్థ టెలీకాస్ట్ చేయనుంది. ఈ కాలంలో ఫిఫాకు సంబంధించిన 34 ఈవెంట్లకు కూడా ఈ సంస్థనే అధికార బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించనుంది. ఓ మీడియా సంస్థ కథనం ప్రకారం భారత్‌కు చెందిన వరల్డ్‌కప్ ప్రసార హక్కులను ఫిఫా రూ. 948 కోట్లకు అమ్మాలనుకుంది. కానీ జీ సంస్థ అత్యధికంగా రూ.500 కోట్లకు బిడ్ వేసి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ఖతార్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లను రిలయన్స్ - డిస్నీ హాట్‌స్టార్ సంయుక్త కంపెనీ అయిన జియో హాట్‌స్టార్‌ ప్రసారం చేసింది. ఈసారి కూడా రిలయన్స్‌కు చెందిన వైకోమ్‌ 18 సంస్థ హక్కుల కోసం గట్టిగానే ప్రయత్నించింది. రూ.200 కోట్లకు వైకోమ్ 18 బిడ్ వేయాలనుకుంది. కానీ, ఫిఫా యాజమాన్యం అంత తక్కువ బిడ్‌కు నిరాకరించింది. చివరకు.. జీ సంస్థ రూ.500 కోట్లకు హస్తగతం చేసుకుంది. అంతేకాదు కొత్తగా నాలుగు ఛానెళ్లను ప్రారంభించినట్టు జీ సంస్థ వెల్లడించింది. యునైట్ 8 స్పోర్ట్స్ 1, యునైట్ 8 స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, యునైట్ 8 స్పోర్ట్స్ 2, యునైట్ 8 స్పోర్ట్స్ 2 హెచ్‌డీలను ఆరంభించామని తెలిపింది. సాకర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 జూన్ 11న మొదలవ్వనుంది. అమెరియా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో 48 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ