బెంగళూరులో జరిగిన 'ది హిందూ హడిల్' సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, గుజరాత్ మోడల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని అత్యంత అగ్రశ్రేణి పదవులైన ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోంమంత్రి, రక్షణమంత్రి వంటి కీలకమైన పోర్ట్‌ఫోలియోలన్నీ కేవలం ఉత్తరాది నేతలకే దక్కుతున్నాయని ఆయన లెక్కలతో సహా ఎండగట్టారు. కేంద్రానికి అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పన్నులు చెల్లిస్తూ, ఢిల్లీకి సెల్యూట్ చేస్తూ దేశంలో రెండో శ్రేణి పౌరులుగా బతకాలని అనుకోవడం లేదు అంటూ దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవ వాదాన్ని బలంగా వినిపించారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని, దాని పేరు వెనుక ఉన్న రహస్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ వేదికపై ఆసక్తికరంగా పంచుకున్నారు. ధనికులు జలవనరులను, చెరువులను ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోలేకనే తాను హైడ్రా ను ఏర్పాటు చేశానని స్పష్టం చేశారు. హిట్లర్‌కు ఇష్టమైన పదం నుండి స్ఫూర్తి పొంది ఈ విభాగానికి పేరు పెట్టానని సంచలన ప్రకటన చేశారు. ఈ విభాగంలో ఏకంగా 3,000 మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని నియమించామని, ఇప్పుడు చెరువులను ఆక్రమించడానికి ఎవరూ సాహసించలేరని హెచ్చరించారు. అలాగే యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి దేశంలోనే అత్యుత్తమమైన ఈగిల్ ఫోర్స్ ను రంగంలోకి దించామన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు : 'ది హిందూ హడిల్' సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి
السبت، 6 يونيو 2026
CM Revanth Reddy at 'The Hindu Huddle' national Southern states are not receiving due importance at the national level telangana
ليست هناك تعليقات:
إرسال تعليق