హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్కంఠగా సాగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) రెండో సీజన్ ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు 41-17 తేడాతో ముంబై డ్రీమర్స్‌ను ఓడించింది. లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్‌కు రూ.45 లక్షల భారీ నగదు బహుమతిని దక్కించుకుంది. రన్నరప్‌గా నిలిచిన ముంబై డ్రీమర్స్ రూ. 25 లక్షలు దక్కాయి. జీఎమ్‌ఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో జరిగిన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. మ్యాచ్ ఆరంభంలో ముంబై జట్టు బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, హైదరాబాద్ బలమైన డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. అద్భుతమైన కౌంటర్ అటాక్‌లతో విరుచుకుపడిన హైదరాబాద్ హీరోస్ తరఫున ఫ్రాన్సిస్కో కాస్కుల్లెలా పాస్‌తో తైతైఫోనో తవితా పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మాన్యుయెల్ మోరెనో ఇచ్చిన పాస్‌ను శివమ్ శుక్లా పాయింట్‌గా మార్చగా, మారిస్ లాంగ్‌బాటమ్ అద్భుతమైన డ్రాప్ గోల్‌తో తొలి అర్ధభాగంలోనే హైదరాబాద్‌కు పూర్తి ఆధిక్యాన్ని అందించాడు. సెకండాఫ్‌లోనూ అదే జోరును కొనసాగించిన హైదరాబాద్ ఆటగాడు డియెగో అర్డావో వరుసగా రెండు రన్స్ సాధించి ముంబైపై ఒత్తిడిని పెంచాడు. ముంబై జట్టు తరఫున ఈథన్ మెక్‌ఫార్లాండ్, జేమ్స్ టర్నర్ ఎంత ప్రయత్నించినప్పటికీ హైదరాబాద్ దూకుడును అడ్డుకోలేకపోయారు. చివర్లో కెవిన్ వెకెసా, టెరియో తమని ఘనమైన ముగింపును ఇవ్వడంతో హైదరాబాద్ విజయం ఖరారైంది. ఇక మూడో స్థానం కోసం జరిగిన రసవత్తర పోరులో చెన్నై బుల్స్‌ను 22-19 పాయింట్ల తేడాతో ఓడించిన బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ రూ. 15 లక్షల బహుమతిని సొంతం చేసుకుంది. ఈ మెగా టోర్నీ ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టాలీవుడ్ టాప్ హీరో చిరంజీవి, ఒలింపిక్ విజేత పి.వి. సింధు, సినీ నటి మృణాల్ ఠాకూర్, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్, జీఎమ్‌ఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ రెండో సీజన్‌లో మహిళల లీగ్‌ను కూడా ప్రారంభించడం రగ్బీ చరిత్రలో సరికొత్త మైలురాయి అని, రాబోయే రోజుల్లో దేశంలో రగ్బీ క్రీడకు ఆదరణ మరింత పెరుగుతుందని రగ్బీ ఇండియా హర్షం వ్యక్తం చేసింది.
రగ్బీ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా హైదరాబాద్
الاثنين، 29 يونيو 2026
Hyderabad Crowned Rugby Premier League Champions Rugby Premier League (RPL) held at the Gachibowli Stadium in Hyderabad sports telangana
ليست هناك تعليقات:
إرسال تعليق