దేశీయ మార్కెట్లో రెడ్‌మీ టర్బో 5 అధికారికంగా విడుదల అయింది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో సైతం గరిష్టంగా 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను మాత్రమే చూస్తుంటాం. కానీ కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెడ్‌మీ టర్బో 5 లో ఏకంగా 7,540mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగదారులకు 2 నుండి 3 రోజుల పాటు నిరంతరాయంగా బ్యాకప్ అందిస్తుంది. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ ఏమాత్రం బరువుగా లేదా లావుగా లేకుండా కేవలం 8.18 mm మందంతో చాలా స్లిమ్‌గా డిజైన్ చేయడం షావోమి సాధించిన సాంకేతిక విజయంగా చెప్పవచ్చు. భారీ బ్యాటరీ అనగానే ఛార్జింగ్ అవ్వడానికి గంటల సమయం పడుతుందని కంగారుపడాల్సిన అవసరం లేదు. దీని కోసం బాక్స్‌లోనే 100W హైపర్‌ఛార్జ్ అడాప్టర్‌ను అందించారు. దీని ద్వారా కేవలం అర గంటలోనే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇందులో 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీ స్నేహితుల ఫోన్లు లేదా బ్లూటూత్ ఇయర్‌బడ్స్ ఛార్జింగ్ అయిపోతే, ఈ ఫోన్‌ను ఒక పవర్ బ్యాంక్‌లా వాడుకుని వాటిని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లో సరికొత్త MediaTek Dimensity 8500 Ultra ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది హెవీ గేమింగ్ తో పాటు మల్టీటాస్కింగ్‌ను ఉపయోగించేవారికి చాలా అనుగుణంగా ఉంటుంది. దీనికి తోడు అల్ట్రా-ఫాస్ట్ LPDDR5X RAM మరియు UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల యాప్స్ ఓపెన్ అవ్వడం, గేమ్స్ లోడ్ అవ్వడం రెప్పపాటు కాలంలో జరిగిపోతాయి. వీడియోలు మరియు గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉండేలా ఇందులో 6.59 అంగుళాల AMOLED డిస్ ప్లే ను అమర్చారు. 1.5K రిజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ ను అందించే ఈ ఫోన్ లో 3500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది కాబట్టి ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో పాటు, కెమెరా మాడ్యూల్ చుట్టూ అమర్చిన RGB లైటింగ్ రింగ్స్ ఈ ఫోన్‌కు సరికొత్త గేమింగ్ మరియు స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి. మెటల్ ఫ్రేమ్‌తో కూడిన ఈ డివైజ్‌కు కఠినమైన IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాను అందించారు. ఇది Sony IMX882 సెన్సార్ మరియు OIS సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల ప్రయాణాల్లో మరియు రాత్రి వేళల్లో కూడా కదల్లేని, స్పష్టమైన ఫోటోలు, 4K వీడియోలు తీసుకోవచ్చు. దీనితో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, మరియు సెల్ఫీల కోసం ముందు వైపు 20MP కెమెరా ఉన్నాయి.
ホーム
/
technology
/
రెడ్‌మీ టర్బో 5 విడుదల
Tuesday, June 16, 2026
business Redmi Turbo 5 Launch Single full charge provides average users with 2 to 3 days of uninterrupted battery backup. Despite housing such a large battery smart phone technology
No comments:
Post a Comment