ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం జిల్లా వంచంగి గ్రామానికి చెందిన కోసూరి రాంబాబు, కూటమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం కలరు. మొదటి అబ్బాయి కోసూరి శివకుమార్ రెడ్డి ( 19) సం. వ్యవసాయ పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో మద్యం సేవిస్తున్నాడు. ఈనెల 12 తేదీ రాత్రి మద్యం సేవించి వచ్చి భోజనం చేయకుండా తండ్రిని సెల్ ఫోన్ అడగడంతో ఇవ్వనని అన్నాడు. భోజనం చేయకుండా మనస్తాపం చెంది అదే రోజు రాత్రి 11.30 సమయంలో పురుగుమందు త్రాగడంతో కుటుంబీకులు ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. అక్కడ నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతూ శివకుమార్ రెడ్డి మరణించాడు. తండ్రి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్. ఐ చినబాబు తెలిపారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబీకులు సమక్షంలో శవపంచనామా నిర్వహించడం పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.
0 Comments