ఐర్లాండ్ చేతిలో భారత్ ఖంగుతిన్నది. రెండు టీ20 సిరీస్‌ల భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన భారత్ 34 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ విజయంతో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం. గత ఎనిమిది ప్రయత్నాల్లో దక్కని విజయం ఈ సారి వరించింది. ఈ గెలుపుతో రెండు టీ20ల సిరీస్‌లో ఐర్లాండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం జరిగే రెండో టీ20ల ఓడినా సిరీస్ సమమవుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కన్ టక్కర్(36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. గారెత్ డెలనీ(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. జార్జ్ డాక్‌రెల్(10 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 19) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా(3/24) మూడు వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్(2/28), అక్షర్ పటేల్(2/33) రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అభిషేక్ శర్మ(20 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49) హాఫ్ సెంచరీ చేజార్చుకోగా .. శివమ్ దూబే(14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
إرسال تعليق